BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 10:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026 ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 10:14 PM
238 వీక్షణలు

చాట్రాయి మండల కేంద్రంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. బిజెపి కార్యాలయం వద్ద, బిజెపి సీనియర్ నాయకుడు గడ్డం సంజీవరెడ్డి నివాసం సమీపంలో, మండల పార్టీ అధ్యక్షుడు ఓబిళ్ళనేని రాజా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ క్రియాశీల సభ్యులు, కార్యకర్తలు పాల్గొని భారత్ మాత, శ్యామ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి మాట్లాడుతూ, ఈ శిక్షణ కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహించబడతాయని, భారతీయ జనతా పార్టీ దిశానిర్దేశక ముఖ్య అంశాలపై జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రముఖ వక్తలు కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తారని వెల్లడించారు.

అన్ని స్థాయిల కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్దేశించిన దిశలో పార్టీ ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.