BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 13 August 2026, 01:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పొలవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా తిరంగా ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 01:35 PM
120 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పొలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం 10 గంటలకు “దేశ నిర్మాణ భాగస్వాములు – నేనూ...” కార్యక్రమంలో భాగంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల ఎంపీడీవో  బి.ఎ సత్యనారాయణ, ఎంఈవో-1 ఎం. శ్రీనివాస్, ఎంఈవో-2 వీఎస్‌యూ బ్రహ్మచారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, బాధ్యత, సృజనాత్మకతను పెంపొందించుకోవడంతో పాటు భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ఎంఈవో-1 ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రదర్శించిన జాతీయ నాయకుల చిత్రపటాలను పరిశీలిస్తూ, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం జాతీయ నాయకులు సాగించిన పోరాటాలను విద్యార్థులకు వివరించారు.

ఎంఈవో-2 వీఎస్‌వి బ్రహ్మాచారి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన స్వంత కల, లక్ష్యాన్ని నిర్దేశించుకుని, బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. శ్రీనివాసరావు జాతీయ నాయకులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో గ్రామంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ కొనసాగిస్తూ విద్యార్థులు తమ దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.