BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 28 June 2026, 01:30 pm
Posted by : బాల్ధా భాస్కర్

Pulse Polio: బీబీనగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం.. ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
28 Jun, 2026 - 01:30 PM
122 వీక్షణలు

బీబీనగర్ | నల్గొండ జిల్లా | NTODAY NEWS

స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామపంచాయతీ, హారిక హైస్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని బీబీనగర్ గ్రామ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పిల్లల ఆరోగ్య రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని కోరారు.

ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తమ చిన్నారులను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి రెండు చుక్కల మందు వేయించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోలీ నర్సింహరెడ్డి, వార్డు సభ్యులు పంజాల ప్రవీణ్ గౌడ్, రొడ్డ యమునా, సోమ శివకుమార్, నెల్లుట్ల శ్రీశైలం, పిట్టల శ్యామల శ్రీనివాస్, బుర్రి సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల రవీందర్, కాసుల మహేష్ గౌడ్, రొడ్డ శ్రీనివాస్, తుమ్మల నరసింహరెడ్డి, ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.