BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 01 May 2026, 08:47 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరం గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం… ఉద్రిక్తతకు దారితీసే పరిణామాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 08:47 AM
236 వీక్షణలు

పోలవరం గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం… ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితులు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. విగ్రహానికి కాళ్లు విరగగొట్టి అవమానకరంగా వ్యవహరించడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గ్రామంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

కొంతకాలంగా అదే ప్రదేశంలో గాంధీ విగ్రహాన్ని తొలగించి బొడ్డురాయి ప్రతిష్టించాలని ఒక వర్గం ప్రయత్నాలు చేయగా, మరొక వర్గం దీనికి వ్యతిరేకంగా నిలిచింది. ఇటీవల ఈ విషయంపై గ్రామంలో వివాదం చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది.

పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. పరిస్థితి అదుపులో ఉండేలా భద్రతా చర్యలు చేపట్టారు.