BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 15 May 2026, 03:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రేమించిన యువతి మోసం చేసిందనే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:52 PM
150 వీక్షణలు

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్లుగా ప్రేమించి ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకున్న యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొహెడ గ్రామానికి చెందిన పల్లపు గోవర్ధన్, సరిత అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ బిడ్డ కూడా పుట్టింది. అయితే ఇటీవల ఆ బిడ్డను అమ్మేసి, మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సరిత సిద్ధమైనట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న గోవర్ధన్ పలుమార్లు ఆమెను తనతో రావాలని వేడుకున్నప్పటికీ సరిత నిరాకరించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆమె పెళ్లి ఏర్పాట్లలో కూడా గోవర్ధన్‌ను ఉపయోగించుకున్నట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గోవర్ధన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మంగళవారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన గోవర్ధన్, బుధవారం ఉదయం నుంచి గదిలోనే ఉండిపోయాడు. సాయంత్రం వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సోదరి తలుపులు పగలగొట్టి చూడగా, గోవర్ధన్ ఉరివేసుకుని మృతిచెందిన స్థితిలో కనిపించాడు.

తన ఆత్మహత్యకు కారణమైన యువతిని వదిలిపెట్టొద్దంటూ గోవర్ధన్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

గోవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా అమ్మేసినట్లు చెబుతున్న చిన్నారి ఆచూకీ ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.