BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

​ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Jun, 2026 - 04:32 PM
10 వీక్షణలు

ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలివ్వాలి   

ఆసుపత్రి వైద్యాధికారికి సీఐటీయు ఆధ్వర్యంలో వినతిపత్రం

డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం: సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్

లక్షెట్టిపేట, (మంచిర్యాల జిల్లా):ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా వేతనాలు ఇవ్వాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ కృష్ణకు కార్మికులు వినతిపత్రం సమర్పించారు.

​ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్య, వైద్య విధాన పరిషత్, పబ్లిక్ హెల్త్ పరిధిలోని జనరల్, జిల్లా, ఏరియా హాస్పిటల్స్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పేషంట్ కేర్, శానిటేషన్, స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కార్మికులు ఏళ్లుగా శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల కాలపరిమితి ముగిసినా వారినే కొనసాగిస్తూ ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. జీఓ నెం.60 ప్రకారం రూ. 15,600 వేతనం చెల్లించాల్సి ఉండగా.. పీఎఫ్, ఈఎస్ఐ మరియు కాంట్రాక్టర్ల కమీషన్ల పేరిట కోతలు విధిస్తూ కేవలం రూ. 11 వేలు మాత్రమే చేతికి ఇస్తున్నారని మండిపడ్డారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనాలు అమలు కాకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

​ఇటీవల హైదరాబాద్‌లోని డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసిన సందర్భంగా.. జూన్ నెల నుండి వేతనాలు పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐలను పకడ్బందీగా అమలు చేస్తూ, అందులో యజమాని వాటాను కార్మికుల జీతాల నుండి కాకుండా ప్రభుత్వమే నేరుగా చెల్లించాలన్నారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి కాంట్రాక్ట్ ఏజెన్సీల వేధింపులను అరికట్టాలని, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్మిక శాఖ ఉత్తర్వుల ప్రకారం సెలవులు అమలు చేయడంతో పాటు ప్రతి ఆసుపత్రిలో సిబ్బంది కోసం ప్రత్యేకంగా విశ్రాంతి గదులు, భోజన వసతి, క్రెచ్ (డే కేర్) సౌకర్యాలు మరియు యూనిఫామ్, రక్షణ పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ న్యాయమైన సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

​ఈ కార్యక్రమంలో కార్మికులు, యూనియన్ నాయకులు గట్టయ్య, విక్రమ్, శ్రవణ్, బన్నీ, లక్ష్మి, స్వరూప, భాగ్య, నాజీమా, రామ, శిరీష, హసీనా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు