BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 09 April 2026, 06:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇళ్ల నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ అధికారుల సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Apr, 2026 - 06:57 PM
265 వీక్షణలు

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0 పథకం కింద ఇళ్ల నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ అధికారుల సూచనలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో గురువారం ఉదయం పీ ఎం ఏ వై (గ్రామీణ) 1.0 పథకం కింద మంజూరు అయిన ఇళ్ల నిర్మాణం పై గృహ నిర్మాణ శాఖ ఈఈ రామోజీ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వెల్లడించిన వివరాలు ప్రకారం, మొత్తం 419 ఇళ్ళకు అనుమతి ఇచ్చారు, ఇందులో 280 ఇళ్లు గ్రౌండ్ లెవల్ కు చేరుకున్నాయి, 221 ఇళ్లు పూర్తయ్యాయి, కానీ 139 ఇళ్ళ నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితి కొనసాగితే, జూన్ నెలాఖరులోపు నిర్మాణం పూర్తి కాని ఇళ్ళకు అనర్హత ఏర్పడుతుందని తెలిపారు.

రామోజీ నాయక్, ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందున్న 59 ఇళ్ళ నిర్మాణం పూర్తిచేస్తే మాత్రమే ప్రభుత్వ పేమెంట్ మంజూరవుతుందని తెలిపారు. అలాగే, ఈ విషయాన్ని కూటమి నాయకులు ఇళ్ల లబ్ధిదారులకు వివరించి, పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా చనుబండ పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు, పీ ఎం ఏ వై పథకం కింద ఎస్సీ, బీ సీ లకు రూ. 50,000 మరియు ఎస్టీ లకు రూ. 75,000 అదనంగా మంజూరవుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థ సారథి గురించి కూడా చర్చించారు, నూజివీడు నియోజకవర్గంలో పెండింగ్ ఉన్న బిల్లుల పేమెంట్ త్వరగా చెల్లించడం వల్ల లబ్ధిదారులు ముందుకు వచ్చి గుర్తించి తీరాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నెక్కళపు వెంకటేశ్వర రావు, పరసా శ్రీను, తునిమెల్లి రాజా, తేనేటి సత్యం, కందుల శివయ్య, కొండా అశోక్, వర్క్ ఇన్స్పెక్టర్ రామదాసు తదితరులు పాల్గొన్నారు.