BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 03 August 2026, 08:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:37 PM
44 వీక్షణలు

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం: పీజీఆర్ఎస్‌లో వినతులు స్వీకరించిన ఆర్డీవో ఎ. కుమార్

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా రెవెన్యూ, భూ వివాదాలు, సర్వే, పాస్‌బుక్స్, పెన్షన్లు, రేషన్, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించిన ఆర్డీవో, ప్రతి వినతిపై సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకుని నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు కృషి చేయాలని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా సమస్యలను వేగంగా పరిష్కరించడం ప్రభుత్వ లక్ష్యమని ఆర్డీవో ఎ. కుమార్ తెలిపారు.

కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.