ప్రజాపాలనతోనే ప్రగతి సాధ్యం : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
NTODAY NEWS చిట్యాల:- ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు ప్రారంభమయ్యాయి. గురువారం నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, ఊరుమడ్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ భాను శ్రీ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ,నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సందర్భంగా గత రెండు సంవత్సరాలలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్దిని ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యలను తీర్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. ప్రజా సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న రాష్ట్ర బడ్జెట్ ను ఆమోదించుకున్న విషయం తెలిసిందేనని, రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అలాగే నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ విడతన ఇదివరకే బేస్మెంట్ వేసుకున్న వారికి, పిల్లర్లు వేసుకున్న వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. విద్యాభివృద్ధిలో భాగంగా నియోజకవర్గానికి ఒక తెలంగాణ మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సీసీ రహదారులు అన్ని సౌకర్యాలు ఉన్నందున మోడల్ స్కూలును ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశంతో కోరారు . ఉరుమడ్ల గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించామని, రెండు అంగన్వాడీ భవనాలు పూర్తి చేశామని, రెండున్నర కోట్ల రూపాయలతో చెరువును పటిష్టం చేశామని, రెండు కోట్ల రూపాయలతో గ్రామానికి బీటీ రహదారి మంజూరు అయిందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థలను, సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రానున్న సంవత్సర కాలంలో ప్రజలకు సంబంధించి మిగిలిపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. గతంలో గ్రామంలో 11 మంది ఎస్సీలకు భూములు ఇవ్వడం జరిగిందని, అయితే దారిలేనందున ప్రత్యామ్నాయంగా మరో భూమిని కేటాయించడం జరిగిందని త్వరితగతిన మా భూమిని లబ్ధిదారులకు ఇప్పించే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ తో కోరారు.
*ప్రభుత్వ విప్ ,నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ
రాష్ట్రప్రభుత్వం గడచిన 2 సంవత్సరాలుగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి వివిధ రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్ ,సన్న బియ్యం, తదితర పథకాలను 6 గ్యారంటీలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఇంకా చాలామంది అర్హులైన వారికి రేషన్ కార్డులు రావాల్సి ఉందని, వాటిని కూడా ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఉరుమడ్ల గ్రామంలో చెరువులు, రహదారులు అన్నింటిని అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, ఉరుమడ్ల గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు.
* జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ
ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా మార్చి 6న ప్రారంభమైన కార్యక్రమం మార్చి 15 వరకు పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్ జరిగిందని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో వివిధ పథకాల కింద లబ్దిదారుల వివరాలను సేకరించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి పథకం ,మహిళకు ఉచిత బస్సు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ వంటివి ఇదివరకే ఇవ్వడం జరిగిందని తెలిపారు. నూతన పథకాల లో భాగంగా పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం, అన్ని వర్గాల ప్రజలకు జీవిత బీమా పథకం, దివ్యాంగులకు మోటారు బ్యాటరీ సైకిళ్లు, రైతులకు మేలైన వంగడాలు ఇస్తున్నామని, ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సందర్భంగా నిర్వహిస్తున్న గ్రామసభలలో ఆయా పథకాల కింద లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలన్నిటిని చదివి వినిపించడమే గాక, గ్రామంలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతున్నదని వెల్లడించారు. అంతకుముందు గ్రామ సర్పంచ్ భానుప్రియ అధ్యక్షతన గ్రామసభ ను ప్రారంభించి రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి ,చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, తహసిల్దార్ విజయ, ఎంపీడీవో జయలక్ష్మి, గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, తదితరులు హాజరయ్యారు.అంతకుముందు ఉరుమడ్ల గ్రామ శివారులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వ విప్ నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్లు ప్రారంభించారు