BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 31 March 2026, 05:44 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ప్రజలకు పుంగనూరు పోలీస్ వారి విజ్ఞప్తి...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 Mar, 2026 - 05:44 PM
136 వీక్షణలు

ప్రజలకు విజ్ఞప్తి – పుంగనూరు పోలీస్ వారి విజ్ఞప్తి...

వేసవి కాలంలో దొంగతనాలు నివారించేందుకు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించగలరు..

ఎవరికి వారు తమ ఇంటి వద్ద, అలాగే గ్రామ వీధులలో సమూహంగా సీసీ కెమెరాలు (CC Cameras) తక్షణం ఏర్పాటు చేసుకోవాలి.

ఇంటి గేటుకు మరియు మెయిన్ డోర్‌కు బలమైన తాళాలు వేసి బయటకు వెళ్లాలి.

బయటకు వెళ్లేటప్పుడు గేట్లు, మెయిన్ డోర్ల తాళలు వేసి జాగ్రత్త పడాలి.

సెలవులలో ఎక్కువ కాలం పాటు బయటకు వెళ్లే సమయంలో, నమ్మకమైన వ్యక్తులకు లేదా పొరుగువారికి ఇల్లు అప్పగించి వెళ్లాలి.

ఇంటి వద్ద నగదు,బంగారం వంటి విలువైన వస్తువులు నిర్లక్ష్యంగా ఉంచవద్దు.

గుర్తు తెలియని వ్యక్తులను ఇంటి వద్దకు అనుమతించవద్దు.

అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

రాత్రి సమయాల్లో ఇంటి బయట ఎవరు పిలిచినా కాస్త గమనించి జాగ్రత్త వహించి తలుపు తెరువ వలెను.

ఇరుగు పొరుగువారితో పరస్పరం  మాట్లాడి అప్రమత్తంగా ఉండాలి. 

అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు కాల్ చేయండి లేదా మీ సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి.

దొంగతనాల నివారణ లో ప్రజలదే ప్రముఖ పాత్ర..

మీ భద్రత - మా బాధ్యత...

– ఇట్లు, సిఐ.సుబ్బారాయుడు 

పుంగనూరు పోలీస్ స్టేషన్, అన్నమయ్య జిల్లా