BREAKING
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు
www.ntodaynews.com

​ప్రపంచ దేశాలకు ఆదర్శం మన ప్రజాస్వామ్యం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
30 May, 2026 - 07:25 PM
208 వీక్షణలు

​ప్రపంచ దేశాలకు ఆదర్శం మన ప్రజాస్వామ్యం: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

​మాక్ పార్లమెంట్‌లో ఘనంగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా అధికారులు

​మంచిర్యాల (నస్పూర్): మన దేశంలో అమలులో ఉన్న ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మాక్ పార్లమెంట్' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా లభించిన ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని, ఓటర్లంతా దీనిని సక్రమంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజలందరూ తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు.  

​ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని అన్నారు. విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదని, జ్ఞానాన్ని సంపాదించడానికి మరియు హక్కులపై అవగాహన పెంచుకోవడానికి తోడ్పడుతుందని తెలిపారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, చదువుతో పాటు ఆత్మరక్షణ విద్యను కూడా నేర్చుకోవాలని సూచించారు. అలాగే మహిళల రక్షణ, పోషణ, సంక్షేమం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన గుర్తుచేశారు.  

​భౌగోళికంగా, ఆర్థికంగా మన దేశం ఎంతో పటిష్టంగా ఉందని, దేశ భవిష్యత్తు అంతా యువత చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. వివిధ సంస్కృతులు ఉన్నప్పటికీ అందరం కలిసికట్టుగా జీవిస్తున్నామని, అక్షరాస్యతలో మంచిర్యాల జిల్లాను ముందంజలో ఉంచేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, మేయర్ ధర్ని మధుకర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు