BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 05 August 2026, 05:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా చాట్రాయి లో అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 05:41 PM
148 వీక్షణలు

చాట్రాయి, ఆగస్టు 5: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం ఐసీడీఎస్ సూపర్వైజర్ జి. గాయత్రీదేవి ఆధ్వర్యంలో జరిగింది. తల్లిపాలు శిశువుల శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో కీలకమని, పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం అవసరమని ఆమె వివరించారు. మొదటి ఆరు నెలల వరకు శిశువులకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం పోషకాహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించాలని సూచించారు.

ఈకార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లల తల్లులు, గర్భిణులు, బాలింతలు, ప్రాంతానికి చెందిన మహిళలు పాల్గొన్నారు.