BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 March 2026, 08:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పర్వతాపురానికి రూ.60 లక్షల అభివృద్ధి వరం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 08:41 PM
287 వీక్షణలు

పర్వతాపురానికి రూ.60 లక్షల అభివృద్ధి వరం

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. గ్రామానికి మొత్తం రూ.60 లక్షల నిధులు మంజూరవడంతో రోడ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.

ఇందులో భాగంగా రూ.20 లక్షల వ్యయంతో ఆర్ & బి రోడ్ నుంచి పిల్లికుంట చెరువు కట్ట వరకు కిలోమీటరు మేర మెటల్ రోడ్ పనులను టీడీపీ నాయకులు ప్రారంభించారు. అదేవిధంగా రూ.40 లక్షలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం చురుకుగా కొనసాగుతోంది.

గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులు మంజూరు చేయడం జరిగింది. గ్రామ అభివృద్ధికి ఇంత భారీగా నిధులు రావడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి పార్థసారధికి గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షురాలు బొర్రా నాగమల్లేశ్వరి, మండల కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు, క్లస్టర్-1 ఇంచార్జి ఉయ్యాల దిలీప్ కుమార్, మాజీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరావు, రాము, బీజేపీ నాయకులు మేకపోతుల వెంకటేశ్వరావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.