పర్యావరణ చట్టాలను ప్రతీ ఒక్కరు పాటించాలి.
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు సూచనల మేరకు శుక్రవారం రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సంస్థ కార్యదర్శి వి. మాధవి లత భువనగిరి పట్టణంలోని పెన్షనర్స్ బిల్డింగులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, పెన్షనర్స్ అసోసియేషన్, భువనగిరి, రోటరీ క్లబ్ భువనగిరి,జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో పర్యావరణ చట్టాలు- పౌరుల పాత్ర అనే అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పర్యావరణ చట్టాలను ప్రతి ఒక్కరు బాధ్యతగా పాటించాలని, భావితరాలకు ప్రాణవాయువును అందించి కాలుష్యం నియంత్రించుటలో పూర్తి బాధ్యత తీసుకోవాలని, నేడు ప్రజలు అనేక రుగ్మతలకు లోను కావాల్సి వస్తుందని వీటిని నివారించడానికి చెట్లు నాటడం, ఇంధన పొదుపు చేయడం, పరిసరాలను పరిశుభ్రముగా ఉంచటం చేయాలని, పర్యావరణ చట్టాలను ప్రతి ఒక్కరు అవగాహన చేసుకుని పాటించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఇచ్చిన సూచనల మేరకు ఘన వ్యర్దాల నిర్వహణ అవగతం చేసుకొని ఆచరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి కాలుష్య నియంత్రణ మండలి ఇ ఇ వెంకన్న, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి,యూనిట్ అధ్యక్షులు కిష్టయ్య,రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి అధ్యక్షులు పి. ఆగేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు జె.భాస్కర్ రెడ్డి,టాప్ర అధ్యక్షులు కె.రమేష్ బాబు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సభ్యులు జె. అంజయ్య,భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎన్.విద్యాసాగర్,మున్సిపాలిటీ సానిటరి ఇన్స్పెక్టర్ జాఫర్ పాల్గొని కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యతతో కార్యాచరణ ఆచరించాలని,అందరూ పర్యావరణ చట్టాన్ని పాటించేటట్లుగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ బిల్డింగ్ పరిసరాలలో అధికారులు, స్వచ్ఛంద సేవకులు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా భువనగిరిలోని మినీ ట్యాంక్ బండ్ దగ్గర పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని కాలుష్య నియంత్రణ మండలి, రోటరి క్లబ్ ఆఫ్ భువనగిరి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఉద్యోగులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు, మునిసిపల్ కార్మికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి వారు జిల్లా వ్యాప్తంగా కాలుష్య నియంత్రణ అంశపై పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు యాదగిరిగుట్ట, ఆలేరు, చీమలకొండూరు పాఠశాలలవారు గెలుపొందారు, వీరికి న్యాయమూర్తి మరియు అధికారులు సర్టిఫికెట్స్ అందచేసారు, కాలుష్య నియంత్రణ చర్యలపై గోడ పత్రికలను ఆవిష్కరించారు మరియు మునిసిపల్ కార్మికులను సన్మానించారు మరియు భువనగిరి కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,బార్ అసోసియేషన్ అధ్యక్షులు,ఎన్. విద్యాసాగర్,కార్యదర్శి యాదగిరి,సీనియర్ న్యాయవాదులు మొక్కలను నాటారు.