BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 05 June 2026, 06:05 pm
Posted by : V శ్రీనివాస్

పర్యావరణ దినోత్సవం: ‘మా కే నామ్ ఏక్ పెడ్’ పిలుపునిచ్చిన బిజెపి నేతలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
05 Jun, 2026 - 06:05 PM
193 వీక్షణలు


పర్యావరణ దినోత్సవం: ‘మా కే నామ్ ఏక్ పెడ్’ పిలుపునిచ్చిన బిజెపి నేతలు

​మున్నా రాజా సిసోడియా, తులా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో మొక్కల పెంపకం

​మంచిర్యాల, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 20, 38వ డివిజన్లలో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నా రాజా సిసోడియా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ‘మా కే నామ్ ఏక్ పెడ్’ (తల్లి పేరు మీద ఒక మొక్క) స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల పేరు మీద మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు.

​సీనియర్ నాయకులు తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ.. ఓపెన్ కాస్ట్ మైనింగ్, పవర్ ప్లాంట్ల వల్ల పర్యావరణం దెబ్బతిన్నదని, కాలుష్యం కారణంగా క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఈ వర్షాకాలంలో ప్రజలందరూ యుద్ధప్రాతిపదికన మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నా రాజా సిసోడియా, తులా మధుసూదన్ రావులతో పాటు బొలిశెట్టి తిరుపతి, దాస్య నాయక్, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, బొగ్గు శ్రీధర్, కార్ల వెంకటేష్, గోపాల్ నాయక్, మహేష్, రమేష్ తదితర ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు