BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 19 April 2026, 07:47 pm
Posted by : కూనురు మధు

పట్టుదలే విజయ రహస్యం : డాక్ట‌ర్ ఏనుగు నరసింహారెడ్డి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
19 Apr, 2026 - 07:47 PM
178 వీక్షణలు

పట్టుదలే విజయ రహస్యం :  డాక్ట‌ర్ ఏనుగు నరసింహారెడ్డి NTODAY NEWS చిట్యాల 

ప్రమోద సాహితీ  మరియు మిత్రబృందం ఆధ్వర్యంలో నరసింహారెడ్డికి ఘనంగా సన్మానం

 ​చిట్యాల,

స్వయంకృషి, పట్టుదలతో కష్టాలను అధిగమించి ఐఏఎస్ హోదా సాధించిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్ట‌ర్ ఏనుగు నరసింహారెడ్డి నేటి తరానికి ఆదర్శమని విశ్రాంత న్యాయమూర్తి కుకుడాల లక్ష్మణ్ కొనియాడారు. ఆదివారం చిట్యాల మండల కేంద్రంలోని ముప్ప మల్లారెడ్డి ఫంక్షన్ హాల్‌లో   ప్రమోద సాహితీ  మరియు మిత్రబృందం ఆధ్వర్యంలో నరసింహారెడ్డికి ఘనంగా పౌర సన్మానం నిర్వహించారు.
​ఈ కార్యక్రమానికి తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షులు కుకుడాల గోవర్ధన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ న్యాయమూర్తి కుకుడాల లక్ష్మణ్ మాట్లాడుతూ క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించడం చిట్యాల ప్రాంతానికి గర్వకారణమన్నారు. ప్రముఖ కవి నాలేశ్వరం శంకరం మాట్లాడుతూ, నరసింహారెడ్డి అధికారిగానూ, కవిగానూ రాణించడం విశేషమన్నారు. డాక్ట‌ర్ తండు కృష్ణ కౌండిన్య ఈ సన్మానం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ​సన్మాన గ్రహీత డాక్ట‌ర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషపై మక్కువతో ఆ భాషలోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నాను. నన్ను తీర్చిదిద్దిన చిట్యాలకు ఎప్పటికీ కృతజ్ఞుడను అని అన్నారు.. పట్టుదలతో కృషి చేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు అని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో  చిట్యాల మునిసిపల్ చైర్మన్ శ్రీమతి పందిరి గీతా రమేష్, వైస్ చైర్మన్ శ్రీమతి గుండెబోయిన లక్ష్మీ సైదులు, కౌన్సిలర్లు శ్రీమతి షబానా అజీమ్, కోనేటి ఎల్లయ్య, జెర్రిపోతుల సత్యనారాయణ, ఏర్పుల పరమేష్, నిమ్మలగోటి శ్రీనివాస్ ప్రమోధ సాహితీ ప్రధాన కార్యదర్శి తాడూరి చంద్రం,సృజన సాహితీ అధ్యక్షులు పెరుమాళ్ళ ఆనంద్, ఏభూషి నరసింహ, డా. సాగర్ల సత్తయ్య, సిలివేరు నరసింహ, నరసింహారెడ్డి మిత్ర బృందం శీలా సత్యనారాయణ, శివకోటి యాదగిరి, ఏనుగు నర్సిరెడ్డి, చెరుపల్లి రఘునాథం,  నాంపల్లి శ్యామ్, ఇమ్మడి శ్రీనివాస్, పోకల స్వామి, సిలివేరు కృష్ణ, పి సుదర్శన్ రెడ్డి, రావుల నర్సిరెడ్డి, ఎండి గాలిబ్, సర్దార్ బహుదూర్ సింగ్, శివకోటి రమేష్, శీలా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.