ఘనంగా బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, డా.బి ర్.అంబేద్కర్ జయంతి వేడుకలు.
ద్రావిడ విశ్వవిద్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, డా.బి ర్.అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగింది.
ద్రావిడ విశ్వవిద్యాలయం కందుకూరి వీరేశలింగం ఆడిటోరియంలో బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు ఫూలే మరియు భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళూరు విశ్వవిద్యాలయం మరియు సెంట్రల్ విశ్వవిద్యాలయం పూణే మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ బి. హనుమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన ప్రసంగంలో ఆయన ఈ ముగ్గురు మహనీయుల జన్మదినాల ప్రాముఖ్యతను, సమాజ అభ్యున్నతికి వారు చేసిన అపూర్వ సేవలను విశదీకరించారు. ముఖ్యంగా బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిరావు ఫూలే, డా. అంబేద్కర్ వంటి మహనీయులు ప్రజల కోసమే ఎలా జీవించారో వివరించారు.
అలాగే ద్రోణాచార్యుడు–అర్జునుల గురు-శిష్య సంబంధాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, విద్యార్థులు అదే విధమైన అంకితభావంతో, ఆసక్తితో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.
ద్రావిడ విశ్వవిద్యాలయ చీప్ గెస్ట్ ఉపకులపతి ప్రొఫెసర్ ఎల్.సి. మల్లయ్య తన ప్రసంగంలో విశ్వవిద్యాలయం స్థాపనకు కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రులు ఎన్.టి. రామారావు, ప్రొఫెసర్ వి.ఐ. సుబ్రహ్మణ్యం మరియు కాశి పాండ్యన్ డాక్టర్ చెల్లప్పకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇంకా విశ్వవిద్యాలయం స్థిరమైన అభివృద్ధి సాధించాలంటే అన్ని అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని, అలాంటి సమిష్టి ప్రయత్నాల ద్వారానే విశ్వవిద్యాలయాన్ని మెరుగైన స్థాయికి సాధించాలని తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు.
అదేవిధంగా, త్వరలోనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుని, ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ విద్యా వేదికపై నిలబెట్టే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
ఈ ఒప్పందం ద్వారా విశ్వవిద్యాలయ అధ్యాపకులు లండన్‌కు వెళ్లి బోధన, చేసే అవకాశం అవకాశం కలుగుతుందని, అక్కడి అధ్యాపకులు ఇక్కడికి వచ్చి బోధించనున్నారని చెప్పారు. అలాగే విద్యార్థి మార్పిడి కార్యక్రమం ద్వారా ఇక్కడి విద్యార్థులు అక్కడికి, అక్కడి విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యనభ్యసించే అవకాశాలు ఏర్పడి, ఇరు విద్యాసంస్థల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని తెలిపారు. భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పిగా ఉండి సేవలందించారని రిజిస్టర్ ఆచార్య.వి. కిరణ్ కుమార్ వవివరించారు. మహాత్మ జ్యోతిరావు పూలే గురించి మాట్లాడుతూ డీన్ ఎకాడమిక్ అఫైర్స్ ఆచార్య .కే .శ్యామల
స్త్రీ విద్య: 1848లో భార్యతో కలిసి బాలికలకు మొదటి పాఠశాల స్థాపన.
సత్యశోధక్ సమాజ్ (1873): కుల వివక్షకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం ఈ సమాజాన్ని స్థాపించారు.
సామాజిక సంస్కరణలు అంటరానితనం నిర్మూలన, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం, రైతు సంక్షేమం కోసం పనిచేశారు.
బిరుదు: 1888లో ప్రజలచే 'మహాత్మా' అని పిలవబడ్డారు అని వివరించారు.“బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ప్రొఫెసర్ అరవింద్ కుమార్ ప్రసంగిస్తూ, సమాజంలోని ప్రతి మనిషి సమానమే అని పేర్కొన్నారు. విద్య అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, విద్య ద్వారానే సమాజంలో ఉన్న అంటరానితనాన్ని తొలగించవచ్చని ఆయన అన్నారు. బాబు జగ్జీవన్‌రామ్ ఎనిమిది సార్లు పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారని, భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడంలో ముఖ్య పాత్ర పోషించారని వివరించారు. భారత ప్రజలందరూ సమానులేనని అని వివరించారు. అంబేద్కర్ గురించి ప్రతి సంవత్సరం చదివినప్పుడు ఏదో ఒక కొత్త విషయం కనపడుతుందని. అంబేద్కర్ తన గురు చెప్పిన మార్గంలో నడిచి అంచల్ అంచలగా అధికారిని విద్యార్థి విద్యార్థులకు డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు, ఈ కార్యక్రమ సమన్వయకర్త ఆచార్య శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు జ్యోతిరావు పూలే అంబేద్కర్ లాంటి మహనీయులు దేశానికి ఎన్నో సేవలు అందించారని వాళ్లు చూపిన దారిలో మనం వెళ్తే ఉన్నత శిఖరానికి చేరుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతులు సాహాధిపతులు పరిశోధకలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
పి.ఎస్.గణేష్ మూర్తి పి.ఆర్.ఓ ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం