BREAKING
ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. డిప్యూటేషన్లు రద్దు... యధా స్థాననానికి అధికారులు బదిలీలు.. నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి నటన రాజకీయం సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి తాడిగడపలో ‘భారీ’ అక్రమ కట్టడాలు: వెనుక ఉన్న ఆ ‘వ్యక్తి ఎవరిది? మాచర్లలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో కుళ్లిన స్థితిలో మృతదేహం... ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. డిప్యూటేషన్లు రద్దు... యధా స్థాననానికి అధికారులు బదిలీలు.. నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి నటన రాజకీయం సేవా రంగాల్లో బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు : ప్రత్తిపాటి తాడిగడపలో ‘భారీ’ అక్రమ కట్టడాలు: వెనుక ఉన్న ఆ ‘వ్యక్తి ఎవరిది? మాచర్లలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో కుళ్లిన స్థితిలో మృతదేహం... ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ
www.ntodaynews.com

శ్రీశైల ద్వార క్షేత్రాలలో ప్రత్యేక పూజలు

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
25 Apr, 2026 - 01:53 PM
76 వీక్షణలు

 శ్రీశైల  ద్వార క్షేత్రాలలో ప్రత్యేక పూజలు

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 

తేది:  25.04.2026

శ్రీశైల ద్వార క్షేత్రాలలో ప్రత్యేక పూజలు

లోక కల్యాణం కోసం దేవస్థానం తేది: 27.04.2026 నుండి  30.04.2026 వరకు అనగా   4 రోజులపాటు శ్రీశైల  ద్వారాక్షేత్రాలలో అక్కడి అధిదేవతలకు ప్రత్యేక పూజలను నిర్వహించనున్నది.

“గిరిప్రదక్షిణ”గా పిలువబడే ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి ఆయా ద్వారక్షేత్రాలలో ప్రత్యేక పూజలను జరిపించిన తరువాత చివరి రోజున అనగా 01.05.2026న శ్రీశైలంలో శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలను జరిపించడం సంప్రదాయంగా వస్తోంది.   

 ఈ అర్చనలలో ప్రతి ఆలయంలోను శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వకరుద్రాభిషేకం, శ్రీ అమ్మవారికి  సహస్రనామార్చన జరిపించబడుతాయి.

ఈ విశేష కైంకర్యంలో శ్రీశైల దేవస్థానం తరుపున ప్రతీ ఆలయంలోను అక్కడ అధిదేవతలకు వస్త్రాలు సమర్పించబడుతాయి. అదే విధంగా ప్రతీ ఆలయంలోను అర్చక సత్కారం చేయబడుతుంది.  ఈ సత్కార కార్యక్రమంలో ఆయా ఆలయాలలోని ప్రధాన అర్చకులకు, ఉపప్రధానార్చకులకు దేవస్థానం తరుపున  నూతన వస్త్రాలు, శ్రీ స్వామిఅమ్మవార్ల ప్రసాదాలు మరియు సంభావన అందజేయబడుతాయి. 

ఈ కార్యక్రమంలో భాగంగా 27.04.2026 శ్రీశైలక్షేత్ర తూర్పుద్వారమైన ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలోనూ, 28.04.2026 దక్షిణ ద్వారమైన కడప జిల్లాలోని సిద్ధవటంలోనూ, 29.04.2026న పశ్చిమద్వారమైన తెలంగాణా రాష్ట్ర జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపురంలోనూ, 30.04.2026న నాగర్‌కర్నూలు జిల్లాలోని ఉత్తరద్వారమైన ఉమామహేశ్వరంలో పూజలను నిర్వహించడం జరుగుతుంది. 

చివరగా 01.05.2026న ఈ దేవస్థానములో శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా విశేషపూజలు జరుగుతాయి. 

శ్రీశైలానికి నేరుగా రోడ్డుమార్గం లేని పూర్వపు రోజులలో ఈ నాలుగు క్షేత్రాల మీదుగా భక్తులు శ్రీశైలాన్ని చేరుకోవడంతో ఈ నాలుగు క్షేత్రాలు శ్రీశైల ద్వార క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి.