BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 20 April 2026, 05:35 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు యువత చిరకాల కోరిక నెరవేరబోతోంది

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 05:35 PM
147 వీక్షణలు

పుంగనూరు యువత చిరకాల కోరిక నెరవేరబోతోంది - పట్టణంలో క్రీడా మైదానానికి రంగం సిద్ధం. ఇంచార్జి సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్)

​పుంగనూరు: జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహిస్తున్న 'జనవాణి' కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా పుంగనూరు పట్టణ యువత నుంచి వచ్చిన ప్రధాన విన్నపం - పట్టణంలో ఒక అధునాతన క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని.

​యువత కోరికపై తక్షణమే స్పందించిన పుంగనూరు జనసేన ఇంచార్జ్ చిన్న రాయల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా అసోసియేషన్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఆయన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర క్రీడల అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ క్రికెట్ విజయ్ కుమార్ సోమవారం పుంగనూరులోని శుభారం కళాశాల మైదానాన్ని స్వయంగా పరిశీలించారు.

​ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, మైదానం ఏర్పాటుపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి, పనులకు శ్రీకారం చుడతామని భరోసా ఇచ్చారు. యువతకు మెరుగైన క్రీడా వసతులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు,  "యువత కోరికను తీర్చడం నా బాధ్యత, త్వరలోనే పుంగనూరు ఆటగాళ్లకు సొంత మైదానం అందుబాటులోకి వస్తుంది"  చిన్న రాయల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.