BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 29 May 2026, 11:17 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో జూన్ 5న మున్సిపల్ బహిరంగ వేలం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 May, 2026 - 11:17 AM
129 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ స్థలాలు, షాపు రూములకు జూన్ 5న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ప్రైవేట్ బస్టాండ్, పుంగమ్మ చెరువు ట్యాంక్ వద్ద గల పబ్లిక్ యూరినల్స్, బస్టాండ్ పరిసరాల్లోని ఖాళీ స్థలాలు, ఖాళీగా ఉన్న జనరల్ షాపు రూములు, ఐ.డి.ఎస్.యం.టి. షాపు రూములు, మార్కెట్ల గుత్తలు తదితరాలకు కాంట్రాక్టు ద్వారా మున్సిపల్ రుసుములు వసూలు

చేసుకునేందుకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో మార్చి 31న నిర్వహించిన వేలంలో పాటదారులు ఎవరూ పాల్గొనని కారణంగా తిరిగి జూన్ 5న ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు గెజిట్లో పొందుపరిచిన నిబంధనల మేరకు వేలంలో పాల్గొనాలని ఆయన కోరారు. వేలం ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని పూర్తి వివరాల కోసం మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని కమిషనర్ మధుసూదన్ రెడ్డి కోరారు.