BREAKING
thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Date of Publish : 15 July 2026, 08:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పవిత్ర సంగమం విజయవంతం.. కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:48 PM
86 వీక్షణలు

ఇబ్రహీంపట్నం, జూలై 15: పవిత్ర కృష్ణా–గోదావరి సంగమం వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మైలవరం నియోజకవర్గం నలుమూలల నుంచి కూటమి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, రైతులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకులు, మండల, గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు, అధికారులు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జలహారతి రాష్ట్రవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిందని, కృష్ణా–గోదావరి నదుల అనుసంధానానికి చారిత్రక గుర్తింపుగా ఈ కార్యక్రమం నిలిచిపోతుందని అన్నారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపుతున్న దూరదృష్టికి ప్రజల నుంచి లభించిన విశేష స్పందనకు ఈ కార్యక్రమమే నిదర్శనమని పేర్కొన్నారు.

ఇదే ఉత్సాహం, ఐక్యత, అంకితభావంతో ప్రజాసేవలో ముందుకు సాగుతూ మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కూటమి కుటుంబ సభ్యులందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.