BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 26 July 2025, 08:26 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కలగళ్ల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి పెద్దన్న విరాళం...

తెలంగాణ
26 Jul, 2025 - 08:26 AM
359 వీక్షణలు
కలగళ్ల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి పెద్దన్న విరాళం... NTODAY NEWS: కూడేరు జూలై 26 ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల పరిధిలోని కలగళ్ల గ్రామంలో దళిత ప్రజలు యువకులు అంబేద్కర్ విగ్రహ నిర్మాణం చేస్తున్నందున నిర్మాణం కొరకు తన వంతు విరాళంగ 5000 రూపాయలను వి.హెచ్.పి.ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఓ.పెద్దన్న కార్యనిర్వాహకులకు శనివారం నగదును అందజేశారు. ఈ సందర్భంగా పెద్దన్న మాట్లాడుతూ దళిత యువకులు దళిత ప్రజలు అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి రాజ్యాంగము గురించి తెలుసుకోవలని అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టడం వారిలో చైతన్యానికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. కలగళ్ల దళిత యువకులను ఆదర్శంగా తీసుకొని. ప్రతి గ్రామంలోనూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయుట కొరకు యువకులు, ప్రభుత్వ అధికారులు దళిత సోదరీ సోదరీమణులు. అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయుట కొరకు ముందుకు రావాలని ఆయన దళిత నాయకులకు సూచించారు. మును ముందు కూడ ఇలాగే ఐకమత్యంతో ముందుకు పోవాలని భవిష్యత్తులో ప్రతి ఒక్క దళిత పిల్లలు చదువుకొని ముందుకెళ్లాలని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గురించి ఆయన ఏ విధంగ కష్టపడ్డాడు,ఆయన ఏ విధమైనటువంటి ఇబ్బందులు కష్టనష్టాలు అవమానాలకు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, వీటన్నిటినీ కూడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అంబేద్కర్ ని స్ఫూర్తిగ తీసుకొని ముందుకెళ్లాలని దళిత ప్రజలకు దళిత యువకులకు విహెచ్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఓ.పెద్దన్న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలగళ్ల అంబేద్కర్ విగ్రహం కార్యనిర్వాహకులు మాట్లాడుతూ. ఆర్థికముగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని. అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించుటకు ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి మహిళలు యువకులు కాలనీ ప్రజలు, అందరూ కష్టపడి సమాధానంతో, నిర్మిస్తున్నామని. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి విగ్రహాన్ని నిర్మించుటకు వారికి తోచిన విరాళములు అందజేయవలనని వారు దాతులను వేడుకున్నారు. ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి కావలసిన సామాగ్రి కావాల్సిన వస్తువులకు దాతలు ముందుకు రావడం జరుగుతుందని. దాదాపు అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తి అయ్యేసరికి పది లక్షల రూపాయలుగా ఖర్చవుతుందని కార్య నిర్వాహకులు అంచనా తెలియజేశారు.ఈకార్యక్రమంలో వి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఓ.పెద్దన్నతో పాటు కలగళ్ల పెన్న ఓబులేసు, కలగల ఆంజనేయులు, నరసింహులు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రాజు, ముద్దలాపురం ఆదినారాయణ, విహెచ్పిఎస్ కలగళ్ల ముత్యాలు , కొత్త మాదిగ వన్నూరప్ప, సిద్ధప్ప,జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.. Follow us on Website Facebook Instagram YouTube