BREAKING
thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Date of Publish : 17 August 2026, 03:17 pm
Posted by : కూనురు మధు

ఎరువుల కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి : వ్యవసాయ అధికారి గిరిబాబు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
17 Aug, 2026 - 03:17 PM
79 వీక్షణలు


ఎరువులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చిట్యాల మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు సూచించారు. ఈ నెల 20వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ యాప్ అమల్లోకి రానున్న నేపథ్యంలో రైతులు ముందుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. చిట్యాల మండలంలో మొత్తం 19,434 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు 13,834 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఐడీ పొందినట్లు తెలిపారు. ఇంకా 5,600 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఫర్టిలైజర్ యూరియా యాప్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త యాప్ ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మాత్రమే ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని రైతులకు ఎరువులు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల చిట్యాల మండలంలోని రైతులందరూ, ముఖ్యంగా ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోని వారు, వెంటనే సమీపంలోని మీసేవ కేంద్రాలు లేదా రైతు వేదికల్లోని ఏఈఓలను సంప్రదించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు విజ్ఞప్తి చేశారు.