BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 06 April 2026, 08:10 pm
Posted by : యామనూరి మల్లికార్జున

ఫలించిన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ కృషి

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
06 Apr, 2026 - 08:10 PM
73 వీక్షణలు

ఫలించిన ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కృషి

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్

రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు

మారనున్న పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు 

రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్  కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుంది. పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని ఆయన చేసిన ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. రూ. 37.25 కోట్లతో స్టేషన్ లో మౌలిక వసతులు అభివృద్ధి చేయనుంది. గత పిఠాపురం పర్యటనలో  ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లిన సందర్భంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు అశుభ్రత, దుర్గంధం వెదజల్లుతుండడాన్ని చూశారు. రైల్వే స్టేషన్ పరిసరాలను తక్షణం శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి నెలలో జరిగిన ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ తో సమావేశం సందర్భంగా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చించారు. ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణమైన పిఠాపురంలోని రైల్వే స్టేషన్ కి దూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తారని, వారి సౌకర్యార్ధం అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని కోరారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ గా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. స్టేషన్ భవనం, ముఖద్వారంతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతిగది నిర్మాణం, అత్యాధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్, ప్లాట్ ఫారం అభివృద్ధి, షెల్టర్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టనుంది. ఈ సందర్భంగా అడిగిన వెంటనే పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసేందుకు సహాయ సహకారాలు అందించిన  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, తక్షణం స్పందించిన రైల్వేమంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, పిఠాపురం అభివృద్ధికి నిరంతర మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.