BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 22 April 2025, 08:30 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కక్కిరేణిలో ఘనంగా ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

తెలంగాణ
22 Apr, 2025 - 08:30 AM
258 వీక్షణలు
కక్కిరేణిలో ఘనంగా ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. (NTODAY NEWS) కూనురు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో ఈరోజు ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీమిడి ఉపేందర్ మాట్లాడుతూ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి గ్రామ పెద్దలు సహకారం అవసరమని జిల్లాలోనే ఉన్నతమైన స్థానం ఉన్న పాఠశాలను అన్ని అవకాశాలు కల్పించుకొని ఈ విద్యా సంవత్సరం 5వ తరగతి గురుకుల పాఠశాల ప్రవేశానికి పరీక్ష రాసి పది మందికి పదిమంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి అందులో ఆరుగురికి మొదటి విడతలోనే మంచి గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రవేశం లభించిందని కావున ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో కూడిన పాఠశాలను గ్రామస్తులు తమ పిల్లల్ని బడిలో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు. సుశిక్షితులైన ఉపాధ్యాయుల బోధనలతో విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ది చెందుతారని ఇలాంటి ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కృషిని అభినందిస్తూ ఘనంగా శాలువాలతో సత్కరించారు. అలాగే పాఠశాలకు వివిధ రకాలుగా సహకరించిన దాతలను ఉపాధ్యాయ బృందం వారిని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ చిల్ల ప్రేమలత మురళి కృష్ణ , ఉపాధ్యాయులు గణేష్ ,గోపాల్ రెడ్డి , కృష్ణ స్వర్ణలత , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు , గ్రామ పెద్దలు పిట్ట కృష్ణారెడ్డి , రాంరెడ్డి , సోమేశ్వరరావు , వేముల సైదులు , మిర్యాల రామకృష్ణ , అంకిరెడ్డి వెంకన్న , చిల్ల మధు , తేడ్ల రాజ్ కుమార్ , గుండు సైదులు , చిల్ల వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube