BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 04:40 pm
Posted by : V శ్రీనివాస్

​రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం: కాంగ్రెస్ తీరుపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆగ్రహం

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 Jul, 2026 - 04:40 PM
243 వీక్షణలు

​రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం: కాంగ్రెస్ తీరుపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆగ్రహం

​నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని అడ్డుపెట్టుకుని దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీరును నిరసిస్తూ లక్షెట్టిపేటలో బీజేపీ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ లక్షెట్టిపేట పట్టణంలో బీజేపీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా హాజరై, కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

​ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ.. నీట్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చించేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నప్పటికీ, రాహుల్ గాంధీ మాత్రం చర్చలో పాల్గొనకుండా పారిపోతున్నారని విమర్శించారు. నీట్ ముసుగులో సంఘ విద్రోహ శక్తులను రెచ్చగొట్టి దేశంలో అల్లర్లు సృష్టించాలనే కుట్రలో భాగంగానే ప్రధాని ఇంటి ముందు ధర్నా చేశారని, ఇది అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రధాని నివాసం ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా దేశ చరిత్రలోనే ఒక 'బ్లాక్ డే' అని ఆయన అభివర్ణించారు. రాహుల్ గాంధీకి ఈ సమస్యపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీధుల్లో కాకుండా పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆయన హితవు పలికారు