BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 09:44 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ఎస్సీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భరోసా..

తెలంగాణ
/ రాజన్న సిరిసిల్ల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
25 Mar, 2026 - 09:44 PM
156 వీక్షణలు

రాజన్న సిరిసిల్ల: ఎస్సీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భరోసా.. స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం 2025-26 వార్షిక ప్రణాళికను ఆమోదించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్, శ్రీమతి గరిమా అగర్వాల్ ఐ.ఏ.ఎస్. గారు ఒక ప్రకటన విడుదల చేశారు.

​అందుబాటులో ఉన్న పథకాలు:

​రవాణా రంగం: టూ వీలర్/ఎలక్ట్రికల్ వెహికల్స్.

​వ్యవసాయ అనుబంధం: అగ్రి డ్రోన్ సర్వీసెస్, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్.

​పశు సంవర్ధక: పాడి గేదెల పంపిణీ.

​పట్టు, ఉద్యానవన: పట్టు పురుగుల పెంపకం, ఆయిల్ పామ్ సాగు.

​సాగునీటి పథకాలు: బోర్ వెల్స్, సబ్ మెర్సిబుల్ పంప్ సెట్ల ఏర్పాటు.

​శిక్షణ కార్యక్రమాలు: నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు.

​దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు:

​ఆధార్ కార్డు, రేషన్ కార్డు.

​కులం మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (గ్రామీణ ప్రాంతం: రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతం: రూ. 2.00 లక్షల లోపు).

​వయస్సు: 21 నుండి 50 ఏళ్ల లోపు ఉండాలి.

​పాస్ పోర్ట్ సైజ్ ఫోటో.

​దరఖాస్తు ప్రక్రియ:

​అర్హులైన అభ్యర్థులు మార్చి 26, 2026 నుండి ఏప్రిల్ 02, 2026 లోపు ఆన్ లైన్ లో https://tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తు కాపీలను సంబంధిత మండల పరిషత్ కార్యాలయాల్లో లేదా మున్సిపాలిటీల్లో సమర్పించాల్సి ఉంటుంది.

​గత 5 ఏళ్లలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందని వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.