BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 March 2026, 09:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రానికి వర్షాల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 09:50 PM
150 వీక్షణలు

రాష్ట్రానికి వర్షాల హెచ్చరిక

అమరావతి, మార్చి 20:

పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, కర్ణాటక–తమిళనాడు మీదుగా విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల పాటు వాతావరణం మార్పులు చోటుచేసుకోనున్నాయి.

రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో రైతులు కోతకు సిద్ధమైన పంటలను రక్షించుకోవాలని, ప్రజలు పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.