BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 March 2026, 07:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Mar, 2026 - 07:20 PM
145 వీక్షణలు

రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు ఘనంగా నిర్వహణ

అమరావతి, మార్చి 30: రాష్ట్రవ్యాప్తంగా నేడు 2.5 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడ్కో లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముక్కర అంబిక అనే లబ్ధిదారు ఇంటి గృహప్రవేశ వేడుకలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మరో లబ్ధిదారు షేక్ నూరి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి సంప్రదాయం ప్రకారం జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూరి కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేసి ఆశీస్సులు అందించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారధి, పి నారాయణ, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే విజయశ్రీ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.