BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

రాయలసీమ లో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
04 Apr, 2026 - 09:29 PM
36 వీక్షణలు

రాయలసీమలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు

బడ్జెట్ అవుట్‌రీచ్ 2026-27 కార్యక్రమం విజయవంతం

బడ్జెట్‌పై ప్రజల్లో అవగాహన పెంపే లక్ష్యం

టెక్నాలజీతో బడ్జెట్ ప్రక్రియ సరళీకరణ

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు కృషి

ఆదాయ వనరుల పెంపుపై ప్రభుత్వ దృష్టి

జిల్లాల స్థాయికి బడ్జెట్ సంస్కరణలు

జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

నంద్యాల, ఏప్రిల్ 04:-

రాయలసీమ జిల్లాల్లో హార్టికల్చర్ హబ్ అభివృద్ధి కోసం సుమారు రు. 40 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు, ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో శృంఖలాబద్ధమైన అభివృద్ధికి దారితీసే ఎకనామిక్ చైన్ రియాక్షన్‌గా మారుతుందని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శనివారం నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ (PGRS) హాలులో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అధ్యక్షతన బడ్జెట్ అవుట్‌రీచ్ 2026–27 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, రాయలసీమలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని, దానికి సుమారు రు.40 వేల కోట్లను ఖర్చు చేయనున్నామని తెలిపారు. ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో శృంఖలాబద్ధమైన అభివృద్ధికి దారితీసే ఎకనామిక్ చైన్ రియాక్షన్‌గా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

బడ్జెట్‌పై ప్రజలకు అవగాహన కల్పించడం “బడ్జెట్ అవుట్‌రీచ్ 2026–27” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. బడ్జెట్ రూపకల్పన అనేది అన్ని శాఖల సమన్వయంతో జరిగే ప్రక్రియ అని పేర్కొంటూ, ప్రతిపాదనల దశలోనే స్పష్టమైన ప్రణాళికలను సమర్పించడం అత్యంత ముఖ్యమని సూచించారు. గతంలో బడ్జెట్ ప్రక్రియ క్లిష్టంగా ఉండేదని, ప్రస్తుతం సాంకేతికత సహాయంతో సరళీకరణ జరిగి, తక్కువ సమయంలోనే వివరాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. “బడ్జెట్ ఇన్ బ్రీఫ్”, “గైడ్ టు బడ్జెట్” వంటి పుస్తకాల ద్వారా ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక సవాళ్లు ఎదురైనా, ఆర్థిక క్రమశిక్షణ, ఆదాయ వనరుల పెంపు ద్వారా పరిస్థితి మెరుగుపడుతోందన్నారు. ముఖ్యంగా కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్ వంటి శాఖల ద్వారా ఆదాయం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సేవారంగ అభివృద్ధి, ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణ ద్వారా మల్టిప్లయర్ ఎఫెక్ట్ సృష్టించి రాష్ట్ర ఆర్థిక వృద్ధిని 11% నుంచి 15% వరకు పెంచడం లక్ష్యమని వెల్లడించారు. జిల్లా స్థాయిలో కూడా బడ్జెట్ సంస్కరణలు అమలు చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని అధికారులకు సూచించారు. బడ్జెట్‌లో పారదర్శకత పెంపు ద్వారా ప్రజలు ప్రభుత్వ పనితీరును సమీక్షించే స్థాయి ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం - ఖర్చుల్లో అధిక భాగం జీతభత్యాలకే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందని... రాష్ట్ర రాబడిలో దాదాపు 99 శాతం వరకు జీతభత్యాలు, పెన్షన్లకే ఖర్చవుతున్న పరిస్థితి నెలకొందని మంత్రి తెలిపారు. ఫిబ్రవరి నెల వరకు ఈ వ్యయం సుమారు 88 శాతంగా ఉండగా, మార్చి నెల లెక్కలు కలిపితే అది 99 శాతానికి చేరినట్లు తెలిపారు. గతంలో 2019-20 మరియు 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో ఈ వ్యయం వరుసగా 100 శాతం, 110 శాతానికి పెరిగినట్లు పేర్కొన్నారు. ఒకప్పుడు 21 శాతంగా ఉన్న హెచ్‌ఆర్ ఖర్చులు ఇప్పుడు భారీగా పెరిగిపోవడం ఆర్థిక వ్యవస్థపై భారంగా మారిందన్నారు. జీతాలు, పెన్షన్లతో పాటు ఆసుపత్రులు, పాఠశాలలు, మధ్యాహ్న భోజన పథకం వంటి కీలక రంగాలకు నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందన్నారు. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్ర పరిస్థితి మరింత దిగువన ఉండగా, పొరుగు తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యయం కేవలం 47 శాతంగా ఉందని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన సుమారు రూ.30 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో భాగంగా గత మార్చి 31న రూ.6,000 కోట్లు, ఈ ఏడాది మార్చిలో రూ.7,000 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

పెన్షన్లకు తొలి ప్రాధాన్యం - జీతాల కంటే ముందుగా చెల్లింపు యోచన

ప్రభుత్వ ప్రాధాన్యతల్లో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు మొదటి స్థానం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇకపై ముందుగా పెన్షన్లు చెల్లించి, ఆ తర్వాతే జీతాలు చెల్లించే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు.

మున్సిపాలిటీల్లో సంస్కరణలు - నిర్ణయాల్లో వేగం

మున్సిపల్ పాలనలో కీలక సంస్కరణలు

 చేపట్టినట్లు పేర్కొన్నారు. గతంలో మున్సిపాలిటీ నిధుల విడుదల ఆర్థిక శాఖ ద్వారా జరిగేదని, దీనివల్ల ఆలస్యం చోటుచేసుకునేదని తెలిపారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను నేరుగా మున్సిపల్ శాఖకు అప్పగించి, కమిషనర్లు మరియు చైర్మన్లకు పూర్తి అధికారాలు కల్పించినట్లు వెల్లడించారు. ఈ సంస్కరణను గత ఏడాది ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్నట్లు తెలిపారు.

డీఎంఎఫ్ నిధుల వినియోగం - జిల్లాలకు స్వయం నిర్ణయాధికారం

జిల్లా కలెక్టర్ల వద్ద ఉండే డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) నిధులు గత ఐదేళ్లలో పూర్తిగా వినియోగించబడటంతో ప్రస్తుతం బ్యాలెన్స్ సున్నాగా మారినట్లు తెలిపారు. ఇకపై ఈ నిధులను జిల్లాల్లోనే ఉంచి, కలెక్టర్లకు గ్రీన్ ఛానల్ ద్వారా స్వతంత్రంగా వినియోగించే అధికారం ఇవ్వాలని నిర్ణయించారు.

కేంద్ర పథకాల వినియోగంలో రాష్ట్ర కృషి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 93 పథకాలలో రాష్ట్రం చురుకుగా భాగస్వామ్యం అవుతూ, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో 14 పథకాలను అమలు చేస్తోంది. గతంలో నిలిచిపోయిన సుమారు 85 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించి, వాటి కోసం రూ.18,000 కోట్లను వినియోగించినట్లు తెలిపారు. కేంద్ర నిధులను సమర్థవంతంగా పొందేందుకు అన్ని శాఖలతో సమన్వయం కొనసాగుతోందని పేర్కొన్నారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధి - భారీ ప్రణాళికలు

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు నీటిపారుదల రంగానికి అధిక నిధులు కేటాయించగా, సుమారు 10,000 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి రూ.3,000 కోట్లను కేటాయించారు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (PPP) మోడల్ ద్వారా సేవలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బడ్జెట్ వివరాలు - ఆదాయం, వ్యయం సమతుల్యం కష్టసాధ్యం

రాష్ట్ర ఆదాయం సుమారు రూ.2,34,000 కోట్లు కాగా, అప్పులతో కలిపి మొత్తం బడ్జెట్ రూ.3,32,000 కోట్లుగా ఉంది. రోజువారీ ఖర్చులకు సంబంధించిన రెవెన్యూ వ్యయం సుమారు రూ.2,56,000 కోట్లు కాగా, దీర్ఘకాల ప్రయోజనాల కోసం క్యాపిటల్ వ్యయం పెంపుపై దృష్టి సారించారు. ఈ ఏడాది రూ.50,000 కోట్ల మూలధన వ్యయం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

పాత బకాయిల క్లియరెన్స్ - కీలక చర్యలు

గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌లో ఉన్న రూ.24,819 కోట్ల బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం క్లియర్ చేసినట్లు వెల్లడించారు. అదనంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కనీసం రూ.2,000 కోట్ల మేర కొత్త వనరులు సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలు - భారీ కేటాయింపులు

రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించింది. ‘ఎన్టీఆర్ భరోసా’కు రూ.33,000 కోట్లు, ‘దీపం’ పథకానికి రూ.2,000 కోట్లు, ‘తల్లికి వందనం’కు సుమారు రూ.10,000 కోట్లు, ‘అన్నదాత సుఖీభవ’కు రూ.6,600 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

పాలనా సంస్కరణలు – పారదర్శకతకు ప్రాధాన్యం

నిధుల కేటాయింపులో ఆలస్యాన్ని తగ్గించేందుకు ఆన్‌లైన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలకు నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయడంతో కలెక్టర్లకు స్పష్టత పెరుగుతుందని అన్నారు. పారదర్శకతను పెంచుతూ బలమైన వ్యవస్థలను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.