BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 March 2026, 04:19 pm
Posted by : V శ్రీనివాస్

రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని వెనక్కి తీసుకోవాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
30 Mar, 2026 - 04:19 PM
118 వీక్షణలు

రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని వెనక్కి తీసుకోవాలి: కలెక్టర్‌కు డీలర్ల విన్నపం

రేషన్ షాపుల్లో ప్రస్తుతం మిగిలి ఉన్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని తమకు సహకరించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా డీలర్ల సంఘం సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం త్వరలో సన్న బియ్యం సరఫరా చేయనున్న నేపథ్యంలో, షాపుల్లో ఇప్పటికే నిల్వ ఉన్న దొడ్డు బియ్యం వల్ల కొత్త స్టాక్ నిల్వకు ఇబ్బందులు తలెత్తుతాయని, తక్షణమే పాత నిల్వలను తరలించాలని వారు ఈ సందర్భంగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో డీలర్ల సంఘం అధ్యక్షుడు సత్యయ్యతో పాటు రామగిరి బాణేష్, బూర్ల మహేందర్, కృష్ణ, రవి, శంకర్ తదితరులు పాల్గొని తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు