BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 25 April 2026, 07:58 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
25 Apr, 2026 - 07:58 PM
206 వీక్షణలు

రైతు సంక్షేమమే ధ్యేయం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు

లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం 

రైతులు ​దళారులను నమ్మి మోసపోవద్దు: గ్రామ సర్పంచ్ 

ఆకుల సుమన్ గౌడ్ 

​ధర్మపురి/లోత్తునూరు, ఏప్రిల్ 25   రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్ మరియు లోత్తునూరు గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ అన్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు, శనివారం సాయంత్రం లోత్తునూరు గ్రామంలో పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

​ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ మాట్లాడుతూ.. కష్టపడి పండించిన పంటను రైతులు తక్కువ ధరకు అమ్ముకొని దళారుల చేతిలో మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ కొనుగోలు కేంద్రాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రం వద్ద తాగునీరు, నీడ వంటి అన్ని కనీస సౌకర్యాలు కల్పించినట్లు ఆయన తెలిపారు.

​పాల్గొన్న నాయకులు:

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఒరగంటి మల్లేష్, వార్డు సభ్యులు బోనాల రాజు, కొప్పు శ్రీను, పీఏసీఎస్ డైరెక్టర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, రైతులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.