BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 April 2026, 07:35 pm
Posted by : కూనురు మధు

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
05 Apr, 2026 - 07:35 PM
277 వీక్షణలు

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ప్రభుత్వ విప్ వేముల వీరేశం 

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అన్నదాతలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం స్పష్టం చేశారు  ఆదివారం నియోజకవర్గ పలు మండలాల్లో ఉన్న  గ్రామాల్లో ఆయన పర్యటించి, నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ​నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం సేకరణను వేగవంతం చేసే దిశగా ఎమ్మెల్యే పలు కేంద్రాలకు శ్రీకారం చుట్టారు. 

​ఇనుపాముల: గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, కొండకిందిగూడెం ఎన్ డి సి ఎం ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రం చెర్కుపల్లి: పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కొనుగోలు కేంద్రాలలో ఉన్న 

​అధికారులకు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని,. తూకంలో తేడాలు లేకుండా, అత్యంత పారదర్శకంగా, సజావుగా ప్రక్రియను పూర్తి చేయాలి అని అన్నారు.. రైతు సంక్షేమమే ఈ ప్రభుత్వ ఏకైక లక్ష్యం అని పేర్కొన్నారు ​ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దళారులను నమ్మి మోసపోకుండా, నేరుగా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి అని. ​నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, తేమ శాతం విషయంలో జాగ్రత్తలు వహించి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలి రైతులకు సూచించారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సొసైటీ చైర్మన్లు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.