BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 06 April 2026, 02:17 pm
Posted by : బోధపల్లి వేణు

రైతులకు వ్యవసాయ యంత్రాల పంపిణీ

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 02:17 PM
136 వీక్షణలు

రైతులకు వ్యవసాయ యంత్రాల పంపిణీ

తొర్రూరులో రైతులకు వ్యవసాయ యంత్రాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి .

పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు వ్యవసాయ పనులకు ఉపయోగపడే యంత్రాలను పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి పంపిణీ చేశారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.రైతుల శ్రమను తగ్గించి వ్యవసాయాన్ని ఆధునికీకరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ యంత్రాల వినియోగంతో సమయం ఆదా అవడంతో పాటు ఖర్చులు తగ్గి, దిగుబడులు పెరుగుతాయని పేర్కొన్నారు. కార్మికుల కొరత ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో యంత్రాల వినియోగం అత్యవసరమని చెప్పారు.

మండలంలోని చిన్న, మధ్య తరగతి రైతులు ఈ యంత్రాల ద్వారా ఎక్కువగా లాభపడతారని, రైతులు సమిష్టిగా ఉపయోగించుకునే విధంగా యంత్రాలను సంరక్షించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, వివిధ గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ సభ్యులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యంత్రాలు అందుకున్న రైతులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు..