BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 07:02 pm
Posted by : P. KISHORE

గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
19 Aug, 2026 - 07:02 PM
75 వీక్షణలు

గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు

గుడిపాల మండలం పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన నిన్న రాత్రి సుమారు 2 గంటల సమయంలో నారగల్లు పంచాయతీ సీఎం కండ్రిగ, మునీశ్వర స్వామి ఆలయం వెనుక ఉన్న తాటికుంట చెరువు వద్ద చోటుచేసుకుంది.

ఎన్‌ఆర్ పేట, జీడినెల్లూరు ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకొచ్చి, గత 20 రోజులుగా తాటికుంట చెరువు వద్ద అక్రమంగా డంప్ చేసి, అక్కడి నుంచి టిప్పర్లలో తమిళనాడుకు తరలిస్తున్నట్లు సమాచారం అందింది.

దీంతో అధికారులు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఆ సమయంలో ఇసుకను లోడ్ చేసుకుని తమిళనాడుకు వెళ్తున్న రెండు టిప్పర్లను ఆపి, ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో గత 20 రోజులుగా తమిళనాడులోని రాణిపేట, వేలూరు, బాలాజీ ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నట్లు డ్రైవర్లు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. నారగల్లుకు చెందిన ఉమాపతి అలియాస్ విక్కీ ఇసుకను తాటికుంట చెరువు వద్ద అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు వారు తెలిపినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి టిప్పర్ డ్రైవర్లు అజిత్ కుమార్, అంబారసుతో పాటు ఇసుకను అక్రమంగా నిల్వ చేసి తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమాపతి అలియాస్ విక్కీపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.