BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 23 January 2026, 06:39 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల అభిషేకం

తెలంగాణ
23 Jan, 2026 - 06:39 AM
380 వీక్షణలు
  బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల అభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యం అవాస్తవ ప్రచారాలు చేయొద్దు: ఈవో ఏకాంబరం స్పష్టం NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం దిగుపల్లి గ్రామంలో వెలసిన మహిమాన్విత శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే రాహుకాల అభిషేక పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఏకాంబరం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు రాహుకాల పూజ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. అయితే ఈరోజు ఉదయం 10 గంటలకే సామాజిక మాధ్యమాల్లో 210 మంది భార్యాభర్తల జంటలు అభిషేక పూజలో పాల్గొన్నట్లు అవాస్తవ సమాచారం ప్రచారం చేయడం జరిగిందని తెలిపారు. వాస్తవంగా ఈరోజు అభిషేక పూజలో కేవలం 10 జంటలు మాత్రమే పాల్గొన్నాయని స్పష్టం చేశారు. బోయకొండ గంగమ్మ ఆలయానికి సంబంధించిన సమాచారం ప్రచురించే ముందు తప్పనిసరిగా ఆలయ అధికారుల వద్ద ధృవీకరించుకోవాలని, ఎలాంటి అవాస్తవాలు ప్రచారం చేయరాదని ఆయన సూచించారు. #BoyakondaGangamma #TempleNews #RahukalaAbhishekam #TempleAdministration #FakeNewsAlert #AndhraPradesh #AnnamayyaDistrict #DevotionalNews Follow us on Website Facebook Instagram YouTube