రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి
రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి --యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు
రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలు రక్షించ వచ్చునని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు శనివారం రోజున కలెక్టరేట్ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీరాజ్ శాఖ వారిచే రక్తదాన శిబిరం జరిగింది.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా ఆపదలో ఉన్న వారిని ప్రాణాలను రక్షించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యదర్శి, సీఈవో ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ అందులో సగం కూడా దాతలు నుంచి సేకరించబడటం లేదన్నారు. రాష్ట్రంలో 8 బ్లడ్ బ్యాంకు లు ఉన్నాయని 9వ బ్లడ్ బ్యాంకు గా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో త్వరలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు ఇందుకోసం రాష్ట్ర రెడ్ క్రాస్ రెండు కోట్ల మేర ఎక్విప్మెంట్ను తమకూర్చనిందని భవన నిర్మాణం కోసం దాత శ్రీధర్ రెడ్డి అయిదు కోట్ల మేర వితరణ చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని వివరించారు రాష్ట్ర గవర్నర్ , రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ దాన కిషోర్ సూచనల మేరకు రాష్ట్రంలో లక్ష రెడ్ క్రాస్ సభ్యత్వం చేయాలన్న లక్ష్యంలో ఇప్పటివరకు 42 వేల సభ్యత్వాన్ని పూర్తి చేసినట్లు శ్రీరాములు వివరించారు. రెడ్ క్రాస్ లో సభ్యులుగా చేరి స్వచ్ఛంద సేవ చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛంద కార్యకర్తలు యువకులు ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు జిల్లా ఆదనపు కలెక్టర్ వెంకారెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడంలో యువత ముందుండాలని కోరారు ఈ సందర్భంగా హైదరాబాద్ విద్య నగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది 86 మంది రక్త దానం చేశారు ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డిఓ కృష్ణారెడ్డి, సీఈవో శోభారాణి, చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, డి ఆర్ డి ఓ నాగిరెడ్డి, అదనపు పిడి సురేష్, డిహెచ్ఎంఓ మనోహర్ ,డిప్యూటీ సీఈవో శ్రీనివాస్, పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి హరి శివ ప్రసాద్,రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీనరసింహారెడ్డి, స్టేట్ ఎంసీ మెంబర్ ఆర్ మహేందర్ రెడ్డి,డివిజన్ చైర్మన్ సద్ది వెంకటరెడ్డి, జిల్లా డైరెక్టర్లు శేక్.హమీద్ పాశ, పి శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఎన్. చారి, టౌన్ అధ్యక్షుడు వై పురుషోత్తం రెడ్డి ,డివిజన్ ప్రతినిధులు రామ్ రెడ్డి, చంద్రశేఖర్, లావణ్య, కవిత,భాగ్యలక్ష్మి, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.