BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 27 July 2026, 09:57 pm
Posted by : కూనురు మధు

​రూ. 8 లక్షలతో 11 కేవీ విద్యుత్ లైన్ల మార్పిడి ​ నిధులు అందజేసిన దశమి ల్యాబ్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
27 Jul, 2026 - 09:57 PM
173 వీక్షణలు

​రూ. 8 లక్షలతో 11 కేవీ విద్యుత్ లైన్ల మార్పిడి ​ నిధులు అందజేసిన దశమి ల్యాబ్

 ​సీఎస్‌ఆర్ నిధుల నుంచి ₹8 లక్షలు మంజూరు చేసిన దశమి ల్యాబ్స్

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ముప్పై ఏళ్లుగా వేధిస్తున్న ప్రమాదకర విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామం మధ్య గుండా వెళ్తున్న 11 కేవీ  విద్యుత్ స్తంభాల వల్ల వర్ష కాలంలో తరచూ షార్ట్ సర్క్యూట్లకు గురై ప్రమాదాలు జరుగుతున్న దృశ్యాన్ని నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం దృష్టికి గ్రామ ప్రజలు తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన ఎమ్మెల్యే వేముల వీరేశం వెంటనే స్పందించి దశమి ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్  యాజమాన్యంతో మాట్లాడారు. కంపెనీ ప్రతినిధులు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుంచి ₹8 లక్షల వ్యయంతో విద్యుత్ లైన్లను గ్రామం వెలుపలికి మార్చేందుకు  ముందుకు వచ్చారు. ​30 ఏళ్ల సమస్యను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పరిష్కరించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం  మరియు సీఎస్‌ఆర్ నిధులు మంజూరు చేసిన దశమి ల్యాబ్స్ యాజమాన్యానికి పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం గ్రామ ప్రజల మరియు పాలకవర్గ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, జల ప్రశాంత్, తెలుసూరి నరసింహ, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, దశమి ల్యాబ్స్ హెచ్‌ఆర్ సురేష్, శ్రీకాకుళం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.