BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 06 June 2026, 05:39 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

రూ.20.46 లక్షల విలువైన ఎర్రచందనం సరుకు పట్టివేత

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Jun, 2026 - 05:39 AM
100 వీక్షణలు

రూ.20.46 లక్షల విలువైన ఎర్రచందనం సరుకు పట్టివేత

కల్లూరులో భారీ ఎర్రచందనం స్వాధీనం

కల్లూరు పోలీసుల అప్రమత్తతతో భారీ ఎర్రచందనం అక్రమ రవాణా యత్నం భగ్నమైంది. శుక్రవారం ఉదయం కల్లూరు ఎస్‌ఐకి అందిన ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు బీసీ కాలనీ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు.

ఉదయం సుమారు 9 గంటల సమయంలో TS07 KC 5074 నంబర్ గల టయోటా ఇటియోస్ కారును తనిఖీ చేయడానికి పోలీసులు ప్రయత్నించగా, వాహన డ్రైవర్ పోలీసులను గమనించి కొంత దూరంలో వాహనాన్ని నిలిపివేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం పోలీసులు వాహనాన్ని పరిశీలించగా అందులో 12 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను తూకం వేయగా వాటి మొత్తం బరువు 358 కిలోగ్రాములుగా తేలింది. ఎర్రచందనం విలువ సుమారు రూ.16,46,800 కాగా, వాహనం విలువ రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.20,46,800గా నిర్ధారించారు.

ఈ ఘటనపై కల్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.