BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 26 June 2026, 01:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రూ.45 లక్షల బంగారం దొరికినా ఆశపడలేదు.. తిరుపతి హోటల్ క్యాషియర్ నిజాయతీకి సెల్యూట్!

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 01:31 PM
222 వీక్షణలు

 తిరుపతిలో అరుదైన నిజాయతీకి నిదర్శనంగా నిలిచిన ఘటన అందరి ప్రశంసలు అందుకుంటోంది. బెంగళూరుకు చెందిన భరత్‌కుమార్ కుటుంబం తిరుమల దర్శనం, వివాహ కార్యక్రమం ముగించుకుని వెళ్తూ జూపార్కు రోడ్డులోని గరుడాద్రి హోటల్‌లో భోజనం చేసింది. అయితే తొందరలో ఏకంగా 300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్‌బ్యాగ్ అక్కడే మర్చిపోయింది.

బెంగళూరు చేరుకున్న తర్వాత బ్యాగ్ కనిపించకపోవడంతో బాధితులు వెంటనే డయల్ 112కు ఫిర్యాదు చేశారు. పోలీసులు హోటల్‌కు చేరుకోగా, అక్కడి క్యాషియర్ శశి తన వద్ద భద్రంగా ఉంచిన బ్యాగ్‌ను ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా పోలీసులకు అప్పగించారు 

ఆ బ్యాగ్‌లో సుమారు రూ.45 లక్షల విలువైన పెళ్లి నగలు ఉండటంతో బాధిత కుటుంబం ఊపిరి పీల్చుకుంది. "నగలు దొరకకపోయి ఉంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లం" అంటూ క్యాషియర్ శశికి భరత్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ అసాధారణ నిజాయతీని గుర్తించిన పోలీసులు శశిని జిల్లా పోలీసు కార్యాలయానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ, "నిజాయతీ అనేది మనిషి సంపాదించే అత్యంత విలువైన ఆస్తి" అని కొనియాడారు.

ప్రలోభాల కంటే విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన క్యాషియర్ శశి... సమాజానికి ఆదర్శంగా నిలిచారు