BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 12 November 2025, 08:56 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పారదర్శకమైన పాలన కోసమే సమాచార హక్కు చట్టం

తెలంగాణ
12 Nov, 2025 - 08:56 AM
251 వీక్షణలు
పారదర్శకమైన పాలన కోసమే సమాచార హక్కు చట్టం. NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార హక్కు చట్టం RTI-2005 ను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు, సహాయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర సమాచార కమిషనర్ పోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు.బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం పై రాష్ట్ర సమాచార కమిషనర్ల ఆధ్వర్యంలో పీఐవో,అపిలెట్ అధికారులకు చట్టం పట్ల నిర్వహించిన అవగాహన సదస్సులో సమాచార కమిషనర్లు దేశాల భూపాల్,పి.వి శ్రీనివాస్ రావు,శ్రీమతి.మోసినా పర్వీన్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు,డి.సి.పి అక్షాంక్ష్ యాదవ్,ఏసిపి రాహుల్ రెడ్డి లతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్టిఐ కమిషనర్ అయోధ్య రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగిన వాళ్లను దోషిగా చూడాలని లేదన్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగిన సమాచారం తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతి ఒక్కరికి సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగే హక్కు ఉందన్నారు. పాలనలో పారదర్శకత కోసమే 2005లో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 41బి చార్ట్ ను తప్పనిసరిగా ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి ఏమీ లేని విధంగా చెయ్యాలనే ఉద్దేశంతో జిల్లాలో పర్యటిస్తున్నామని 15 జిల్లాలో పర్యటించి అప్పటికప్పుడే పరిష్కారం అయ్యే విధంగా చేస్తున్నామన్నారు .6(1) కింద దరఖాసుదారుడు కోరిన సమాచారం అందించాలని,ప్రతి కార్యాలయంలో పిఐఓ,ఏపీఐఓ లు దరఖాస్తులు స్వీకరించి నిర్ణీత సమయంలో సమాచారం అందించాలని.అధికారులు RTI చట్టం-2005 పై అందరికీ సమగ్రమైన అవగాహన కల్పించి పటిష్టంగా అమలు జరగాలని లక్ష్యంగా ఆర్టిఏ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం పౌరులకు పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన అందించడంలో కీలకమైన సాధనమని తెలిపారు. పీఐవో అధికారులు ప్రజలకు సమయానికి, పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించారు.ఆర్టిఐ దరఖాస్తుల పరిష్కారం ఆలస్యం కాకుండా, చట్టంలో ఉన్న సమయపరిమితి లోపల సమాధానమివ్వాలని ఆదేశించారు. గత మూడు సంవత్సరాల నుండి ఆర్టిఐ కేసులో పెండింగ్ ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లాల పర్యటనలు చేపట్టడం జరుగుతుందన్నారు.పారదర్శకమైన పాలన కోసం చట్టం ఉపయోగపడాలని, ప్రజలు చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా వినియోగించుకోవాలన్నారు. అధికారులు చట్టం పట్ల భయం విడనాడి నిర్భయంగా యాక్ట్ ప్రకారం అడిగిన సమాచారాన్ని నిర్ణీత సమయంలో అందజేయాలని. ఆర్టిఐ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే అవినీతి తగ్గిపోతుందని, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. అన్ని శాఖల అధికారులు 4-1బి, సిటిజన్ చార్టర్ ను పక్కాగా అమలు చేస్తే సమస్యలు తగ్గుతాయి అన్నారు. ప్రభుత్వ శాఖలు పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని, జిల్లాస్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి అధికారులకు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర సమాచార కమిషన్ కమిషనర్లు దేశాల భూపాల్,అధికారులకు ఆర్టిఐ యాక్ట్ పై దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సమాచార హక్కు చట్టం రెండు వైపులా పదునైన చట్టమని అన్నారు. రాష్ట్ర సమాచార కమిషన్ పర్వీన్ మాట్లాడుతూ... సమాచార హక్కు చట్టాల్లో 6 చాప్టర్లు,31 సెక్షన్లు ఉన్నాయన్నారు.సెక్షన్ల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పి.ఐ.ఓ, ఏ.పి.ఐ.ఓలకు క్షుణ్ణంగా వివరించారు. జిల్లా కలెక్టర్ హనుమంత రావు మాట్లడుతూ... సమాచార హక్కు చట్టం నిజాయితీగా,పారదర్శకంగా, నిక్పక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కమిషన్ పని చేస్తుందన్నారు.సమాచార కోరిన వ్యక్తికి నిర్దేశిత వ్యవధిలో కాకుండా ముందుగానే సమాచారం అందించాలన్నారు.ప్రతి ఒక్క అధికారి అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లాలోని అందరూ పీఐవో అధికారులు యాక్ట్ నిబంధనల ప్రకారం సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అనంతరం కమిషనర్లను శాలువ, మెమొంటోలతో కలెక్టర్ సత్కరించారు. సమావేశ అనంతరం పెండింగ్ లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులపై విచారణ నిర్వహించారు.సంబంధిత పీఐవో అధికారులు, దరఖాస్తుదారుల నుండి వివరాలు స్వీకరించి తగిన ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు,ఆర్డిఓ కృష్ణా రెడ్డి , జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ,వివిధ శాఖల పిఐఓలు,ఏ.పి.ఐ.ఓలు,అప్పీలెట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube