BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 04 June 2026, 05:54 pm
Posted by : V శ్రీనివాస్

​సైబర్ క్రైమ్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై మధుసూదన్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 05:54 PM
125 వీక్షణలు

పాత మంచిర్యాల 14వ డివిజన్‌లో ఘనంగా వార్డు సభ 

​• డివిజన్ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు

​• పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: కార్పొరేటర్ తుమ్మల నరేష్

యువత సైబర్ క్రైమ్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) మధుసూదన్ పిలుపునిచ్చారు. పాత మంచిర్యాలలోని 14వ డివిజన్‌లో కార్పొరేటర్ తుమ్మల నరేష్ అధ్యక్షతన గురువారం వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై మధుసూదన్ మాట్లాడుతూ, సాంకేతికత పెరుగుతున్న నేటి రోజుల్లో యువత సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని, ఉన్నత ఆశయాలతో సమాజంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

​డివిజన్ సమస్యలపై చర్చ:

ఈ వార్డు సభలో స్థానిక ప్రజలు తమ డివిజన్ పరిధిలోని పలు సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు తదితర సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.

​అభివృద్ధిలో భాగస్వాములు కావాలి:

సభకు అధ్యక్షత వహించిన 14వ డివిజన్ కార్పొరేటర్ తుమ్మల నరేష్ మాట్లాడుతూ, డివిజన్ పరిధిలో పరిసరాల పరిశుభ్రతకు ప్రజలంతా తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగి వార్డు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు