BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 19 April 2026, 03:22 pm
Posted by : NTODAY NEWS

సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
19 Apr, 2026 - 03:22 PM
147 వీక్షణలు

హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతునవారిపై పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక దృష్టి

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్‌ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి I రంజన్ రతన్ కుమార్ తెలిపారు.ఈ డ్రైవ్‌లో భాగంగా 315 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.268 ద్విచక్ర వాహనదారులు,15 ఆటోలు,28 కార్లు, 04 వీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి.

బ్లడ్‌ ఆల్కహాల్‌ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే —277 మంది 36 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 200 ఎం జీ/100 ఎంఎల్ మధ్య,27 మంది 201 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 300 ఎం జీ/100 ఎంఎల్ మధ్య,11 మంది 301 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 550 ఎం జీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్‌ సేవించి పట్టుబడ్డారు.

వీరందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపర్చనున్నట్లు సంబంధిత పోలీసులు అధికారులు తెలిపారు.

మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయటం తీవ్రమైన నేరమని సైబరాబాద్‌ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్‌ 105 (కల్పబుల్‌ హోమిసైడ్‌ నాట్‌ అమౌంటింగ్‌ టు మర్డర్‌) కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది.

గత వారం (13.04.2026–18.04.2026) లో మొత్తం120 డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసులను కోర్టులు పరిష్కరించాయి.వీరిలో 01 మందికి జరిమానా, జైలు శిక్ష,00 మందికి జరిమానా, సోషల్‌ సర్వీస్,119 మందికి జరిమానా విధించబడినట్లు ట్రాఫిక్‌ పోలీస్ అధికారులు తెలిపారు.

Sd/-  DCP Traffic I, Ranjan Ratan Kumar.