BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 26 June 2026, 01:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సీఎం పర్యటనతో మార్కాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 01:17 PM
110 వీక్షణలు

మార్కాపురం, జూన్ 26 (వార్త): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఈ నెల 27న మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో **'సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్'**ను ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాఫిక్ రద్దీని నివారించి ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా భారీ వాహనాలు, గూడ్స్ వాహనాలు, బస్సులకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు, కార్లు, ఇతర చిన్న వాహనాలకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలు చేయనున్నారు.

మార్కాపురం నుంచి గిద్దలూరు వెళ్లే భారీ వాహనాలు మోట్టు–పోరుమామిళ్ల–మైదుకూరు మార్గంలో, నంద్యాల నుంచి మార్కాపురం వచ్చే భారీ వాహనాలు నంద్యాల–ఆళ్లగడ్డ–మైదుకూరు–పోరుమామిళ్ల–తాటిచెర్ల మోటు మార్గంలో ప్రయాణించాలని సూచించారు.

అలాగే మార్కాపురం నుంచి వచ్చే వాహనాలు అవసరమైతే పందిళ్లపల్లి టోల్ గేట్ వద్ద, నంద్యాల నుంచి వచ్చే వాహనాలు భీమేశ్వరం ఆలయం సమీపంలోని ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షల సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగిస్తూ పోలీసులకు సహకరించాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.