BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 04:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సీజన్-2 ఆన్‌లైన్ బైబిల్ క్విజ్ విజేతలకు ఘనంగా బహుమతుల ప్రదానం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 04:14 PM
140 వీక్షణలు

సీజన్-2 ఆన్‌లైన్ బైబిల్ క్విజ్ విజయవంతం  విజేతలకు ఘనంగా బహుమతుల ప్రదానం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామానికి చెందిన కల్లేపల్లి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్‌లైన్ బైబిల్ క్విజ్ సీజన్-2 విజయవంతంగా ముగిసింది. శ్రమల దినముల సందర్భంగా 40 రోజుల పాటు నిర్వహించిన ఈ క్విజ్ మొత్తం 50 మార్కులకు నిర్వహించారు.

ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి దాసరి శ్రీను గెలుచుకోగా, రెండో బహుమతిని సతీష్ మరియు రామకృష్ణ సాధించారు. మూడో బహుమతి కొమ్ము ఆనంద్ మరియు షైనీకి దక్కగా, నాలుగో బహుమతి మనీషా, ఐదవ బహుమతి శ్రావణి మరియు ఏసేబు పొందారు.

ఈ సందర్భంగా కల్లేపల్లి రాజేష్ మాట్లాడుతూ, సుమారు 60 మంది ఈ క్విజ్‌లో పాల్గొన్నారని తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, పోటీదారులు ఎంతో ఆసక్తితో పాల్గొన్నారని అన్నారు. భవిష్యత్తులో 2027 సంవత్సరంలో మరింత విస్తృతంగా ఈ క్విజ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అలాగే, గత ఆరు సంవత్సరాలుగా క్రిస్మస్ సందర్భంగా గ్రామాల చర్చిలలో బైబిల్ పరీక్షలు నిర్వహిస్తున్నానని, అదే ఉత్సాహంతో శ్రమల కాలంలో కూడా బైబిల్ జ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశంతో ఈ ఆన్‌లైన్ క్విజ్ ప్రారంభించానని తెలిపారు. వాట్సాప్ స్టేటస్ ద్వారా ప్రశ్నలు పంపిస్తూ, సరైన సమాధానాలు చెప్పిన వారికి బహుమతులు అందజేస్తున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన కల్లేపల్లి దుర్గారావుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొదటి, రెండో బహుమతులను ఈస్టర్ పండుగ రోజున చర్చిలో పాస్టర్ల సమక్షంలో అందజేసినట్లు పేర్కొన్నారు.

మరింతగా, యేసుక్రీస్తు బోధనలు, స్వస్థతలు, అద్భుతాల గురించి ప్రజలు తెలుసుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆసక్తి ఉన్న వారు తన మొబైల్ నంబర్ 9652077560కు సంప్రదించి వాట్సాప్ స్టేటస్ ద్వారా క్విజ్‌లో పాల్గొనవచ్చని తెలిపారు.