BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 06 June 2026, 06:11 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
06 Jun, 2026 - 06:11 PM
48 వీక్షణలు

అత్యాచార కేసు చిలకలూరిపేట, జూన్ 6:

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన సీఐ చిన్నమల్లయ్యను వినుకొండ పోలీసులు శనివారం చిలకలూరిపేట సివిల్ కోర్టులో హాజరుపరిచారు.

ఆయనపై నమోదైన కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి రావడంతో పోలీసు శాఖ ఇప్పటికే చిన్నమల్లయ్యపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని సస్పెండ్ చేసింది.

కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.