BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 22 March 2026, 01:10 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
22 Mar, 2026 - 01:10 PM
382 వీక్షణలు

సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ఆయిల్ ఫామ్ కర్మాగారాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  ఈరోజు సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేయనున్నారు.దీంతో పాటు రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు సిద్ధిపేట జిల్లాలో రూ. 775.72 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి  మంత్రులతో కలిసి శంకుస్థాపన చేస్తారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతారు. అక్కడ పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు.

సిద్ధిపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి  చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు – ప్రారంభోత్సవాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి

1)300 కోట్లతో నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం.

2)141.34 కోట్లతో సిద్దిపేట మున్సిపాలిటీలో నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులకు శంకుస్థాపన.

3)78 కోట్లతో ఎన్సాన్‌పల్లిలో జిల్లా జైలు భవనం ప్రారంభోత్సవం.

4)15 కోట్లతో ఎన్సాన్‌పల్లిలో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రి ప్రారంభోత్సవం.

5)3.60 కోట్లతో ఎన్సాన్‌పల్లిలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ప్రారంభోత్సవం.

6)1.43 కోట్లతో నంగునూరు మండలం గట్లమల్యాలలో PHC భవనం ప్రారంభోత్సవం.

7)1.43 కోట్లతో సిద్దిపేట మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్ లో నిర్మించిన UPHC భవనం ప్రారంభోత్సవం.

_గజ్వేల్ నియోజకవర్గంలో శంకుస్థాపనలు/ ప్రారంభోత్సవాల వివరాలు:

1)200 కోట్లతో కొండపాకలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన.

2)16.62 కోట్లతో మర్కూక్‌లోని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో అదనపు మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన.

3)8.65 కోట్లతో మర్కూక్‌లో సమీకృత మండల కార్యాలయాల సముదాయం (IOC) ప్రారంభోత్సవం

4)9.65 కోట్లతో జగదేవ్‌పూర్‌లో సమీకృత మండల కార్యాలయాల సముదాయం (IOC) ప్రారంభోత్సవం.