BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 28 May 2026, 12:42 pm
Posted by : NTODAY NEWS

సింగరేణి కార్మికుల్లో తీవ్ర ఆవేదన

జాతీయం జాతీయం
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
28 May, 2026 - 12:42 PM
175 వీక్షణలు

ఎనిమిది నెలలైనా విడుదల కాని ప్రమోషన్ ఆర్డర్లు

సింగరేణి కాలరీస్‌ సంస్థ పరిధిలో ప్రమోషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ, అర్హులైన కార్మికులకు ఇప్పటికీ ప్రమోషన్ ఆర్డర్లు జారీ చేయకపోవడం కార్మిక వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. సీనియారిటీ జాబితాలు ఖరారు చేయకపోవడం, గనుల కేటాయింపులు చేపట్టకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా గత మూడు నెలలుగా ఈ ప్రక్రియ నిరంతరం వాయిదా పడుతుండటంతో యాజమాన్య తీరుపై కార్మికుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ తమ భవిష్యత్తు ఇంకా అనిశ్చితిలోనే ఉందని పలువురు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమోషన్ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగ పరమైన పురోగతితో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం పడుతోందని వారు పేర్కొంటున్నారు. కొంతమంది కార్మికులు కొత్త గనుల కేటాయింపులపై స్పష్టత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి, కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్న కార్మికులను తిరిగి పాత గనులకే పంపించాలని, పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ ఆర్డర్లను వెంటనే విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రమోషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశముందని కార్మిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.