BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 23 May 2026, 07:32 pm
Posted by : V శ్రీనివాస్

​సింగరేణి విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు: పీడీఎస్‌యూ నిరసన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 May, 2026 - 07:32 PM
174 వీక్షణలు

​అర్హత లేని వారికి, ఇంటర్వ్యూకు రాని వారికి పోస్టులా? – జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్ ఆగ్రహం 

​శ్రీరాంపూర్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని, దీనిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాతంత్ర విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల విడుదల చేసిన ప్రకటన ప్రకారం అర్హతల ఆధారంగా నియామకాలు చేపట్టకుండా, నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారని తీవ్రంగా ఆరోపించారు.

​ఈ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, కనీసం ముఖాముఖి పరీక్షకు కూడా హాజరుకాని వ్యక్తులను, గతంలో అక్కడ పనిచేసిన వారనే సాకుతో మళ్లీ విధుల్లోకి తీసుకోవడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేసేలా సాగిన ఈ విరుద్ధ నియామకాలపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.