BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 08:59 am
Posted by : ఉపారపు లక్ష్మణ్

సలేశ్వరం జాతర భద్రత ఏర్పాట్లను సమీక్షించిన జోగులాంబ జోన్ డి ఐ జి -ఎల్. ఎస్.చౌహన్.

తెలంగాణ
/ నాగర్ కర్నూల్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
04 Apr, 2026 - 08:59 AM
121 వీక్షణలు

సలేశ్వరం జాతర భద్రత ఏర్పాట్లను సమీక్షించిన జోగులాంబ జోన్ డి ఐ జి -ఎల్. ఎస్.చౌహన్.

 భద్రత ఏర్పాట్ల పై సంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ను ప్రశంసించారు.

 లోయలో జారిపడ్డ వ్యక్తిని క్షేమంగా పైకి తీసుకువచ్చిన పోలీస్ సిబ్బందిని ప్రశంసించారు.

శుక్రవారం ఉదయం జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ ఎస్ చౌహన్ సలేశ్వరం జాతరలో ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ.డా.సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జోగులంబ జోన్ డిఐజి ఎల్ ఎస్ చౌహన్  మాట్లాడుతూ సలేశ్వరం జాతరలో భారీ బందోబస్తు ఏర్పాటు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగిన వెంటనే స్పందించే విధంగా పోలీస్ కంట్రోల్ రూమ్ గురించి, ట్రాఫిక్ నియంత్రణ గురించి ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పాయింట్స్ మరియు భద్రత ఏర్పాట్ల పై సంతృప్తి వ్యక్తం చేస్తూ విధుల పట్ల సిబ్బంది చూపుతున్న అంకితభావాన్ని ప్రశంసించారు.    

సలేశ్వరం జాతర బందోబస్తు ఏర్పాటు గురించి జిల్లా ఎస్పీని ప్రత్యేకంగా అభినందించారు. 

అదేవిధంగా గురువారం రాత్రి నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ బాబుమియా కాలు జారి ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు, అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై మురళి, కానిస్టేబుల్స్ ఊర్మిళ, మాణిక్యం వెంటనే గమనించి అతనిని తమ భుజాలపై మోసుకొని గట్టు పైకి తీసుకొచ్చి ఆసుపత్రిలో వైద్యం అందించడంపై కానిస్టేబుల్స్ ని ప్రశంసించారు. ఇలాగే సిబ్బంది అందరూ అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ పోలీసు వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.